కేసీఆర్ నలభై కిలోల డైనమైట్: పోసాని కృష్ణమురళి

06-12-2019 Fri 20:28
  • నాడు గ్యాంగ్ స్టర్ నయీం అందరినీ బెదిరించేవాడు
  • అప్పటి ప్రభుత్వాలకు, మంత్రులకూ నయీం అంటే భయమే
  • కేసీఆర్ సీఎం అయ్యాక ఏం జరిగిందో అందరికీ తెలుసు

దిశ ఘటనలో నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఘటనపై మాట్లాడిన వైసీపీ నాయకుడు, నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రస్తావన తెచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్ నయీం తిరిగేవాడని, అదే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉండకూడదని ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు.
 
నాడు నయీమ్ అంటే ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం అని, కానీ, కేసీఆర్ ఇలాంటి వాటికి భయపడే వ్యక్తి కాదని, నలభై కిలోల డైనమైట్ అని ప్రశంసించారు. భారతదేశంలో ఎన్ని పండగలు ఉన్నాయో ఆ పండగలన్నింటి కన్నా ఈరోజు తనకు పెద్ద పండగ అని అన్నారు.