అమెరికా అధికారిక రేడియోలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ వార్త

06-12-2019 Fri 20:04
  • అమెరికా దేశ ప్రభుత్వ రేడియోలో వార్త
  • ఉదయం బులిటెన్ లో ప్రసారం
  • ప్రపంచాన్ని కదిలించిన అమానుష ఘటన

దిశ అత్యాచార, హత్య ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీన్ని పార్లమెంట్ సైతం ముక్తకంఠంతో ఖండించింది. తాజాగా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వార్తను అమెరికా మీడియా సైతం ప్రముఖంగా ప్రసారం చేసింది. దీంతో, ఈ అమానుష ఘటన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని కదిలించింది అని అర్ధం అవుతోంది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వార్తను అమెరికా ప్రభుత్వ అధికారిక రేడియో ‘నేషనల్ పబ్లిక్ రేడియో’ ఉదయం బులిటెనులో ప్రముఖంగా ప్రసారం చేసింది.