ఈ ఎన్ కౌంటర్ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చింది: మంత్రి తలసాని

06-12-2019 Fri 19:14
  •  యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తోంది
  • కేసీఆర్ ని జాతీయనేతలు సైతం ప్రశంసిస్తున్నారు
  • మానవ హక్కుల నేతల మాటలు పట్టించుకోనక్కర్లేదు

దిశ అత్యాచారం కేసులో నిందితులు ఎన్ కౌంట్ లో హతం కావడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ ఎన్ కౌంటర్ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చిందని అన్నారు. యావత్తు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని, కేసీఆర్ ని జాతీయనేతలు సైతం ప్రశంసిస్తున్నారని కొనియాడారు.

ఈ ఘటన గురించి మానవహక్కుల నేతల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే మరణశాసనమే అన్న భయం నిందితుల్లో కలగాలని చెప్పిన తలసాని, గతంలో జరిగిన వికారుద్దీన్, నయీం ఎన్ కౌంటర్ల గురించి ప్రస్తావించిన తలసాని, నిర్భయ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్న విషయాన్నీ గుర్తుచేశారు.