USA: యూఎస్ లో ఉబర్ వాహనాల్లో పెరిగిన లైంగిక దాడులు

  • 2018లో అత్యాచారానికి గురైన వారి సంఖ్య 235
  • 2017లో ఈ బాధితుల సంఖ్య 229
  • బాధితుల్లో మహిళా డ్రైవర్లూ కూడా..

యూఎస్ లో తమ సంస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణిస్తున్న మహిళలపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన వివరాలను ఉబర్ సంస్థ వెల్లడించింది. ఇందులో అత్యాచారానికి గురైన వారిలో మహిళా డ్రైవర్లు సహా ప్రయాణికులు కూడా ఉన్నారు. 2017, 2018 సంవత్సరాలకు గాను నివేదికలను విడుదల చేసింది. ఉబెర్ సంస్థకి 2017లో తమపై అత్యాచారం జరిగిందంటూ 229 మంది మహిళలు ఫిర్యాదులు చేయగా, 2018లో అవి పెరిగి 235 కు చేరుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

ఉబర్ సంస్థ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ రెండు సంవత్సరాలకు గాను తమ వాహనాల్లో జరిగిన లైంగిక దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు వంటి దుర్ఘటనల సమాచారాన్ని వెలువరించింది. లైంగిక దాడులు జరిగినట్టు ఆరోపించిన వారిలో మహిళా డ్రైవర్లు కూడా వుండడం విశేషం. ఇదిలా ఉండగా, ఉబర్ వాహనాల్లో చనిపోయిన వారి సంఖ్య 2017 లో పది ఉండగా, 2018లో ఆ సంఖ్య తొమ్మిదిగా ఉందని నివేదిక పేర్కొంది.

More Telugu News