Umabharathi: హైదరాబాద్ పోలీసుల చర్య మహిళల భద్రతకు భరోసా: కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి

  • దిశ హత్యోదంతం 2019లోనే అతి పెద్దది 
  • మానవతా వాదులను కదిలించిన ఘటన 
  • పోలీసుల చర్యను అభినందిస్తున్నా

దిశ హత్యోదంతం కేసులో ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు బాధిత కుటుంబానికి సముచిత న్యాయం చేశారని బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులను కదిలించిన సంఘటన ఇది అని, ఈ ఏడాది చివరిలో జరిగిన అత్యంత పాశవిక నేరమని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలను వేధించే కామాంధులకు ఇదో గుణపాఠమని, నిందితులు అదే ప్రాంతంలో చావడం వల్ల దిశ ఆత్మశాంతిస్తుందన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాన్ని హిందీలో ట్వీట్ చేశారు.

పోలీసుల చర్యలు మహిళలకు ఎంతో భద్రత ఇస్తాయని, ధైర్యాన్ని ప్రోది చేస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. నేరస్తులకు సత్వర గుణపాఠం చెప్పేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించారని, ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి శుభాభినందనలన్నారు. జై తెలంగాణ పోలీస్ అంటూ ఆమె ముగించారు.

More Telugu News