Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!

  • సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • నాలుగు పండుగలు ఆదివారాల్లో.. ఒకటి రెండో శనివారం
  • ఐచ్ఛిక సెలవు కూడా ఆదివారమే

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిరాశ కలిగించే వార్తే. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారం, రెండో శనివారాల్లో రానున్నాయి. దీంతో ఈ సెలవులను వారు కోల్పోయినట్టు అయింది. రిపబ్లిక్‌ డే, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహర్రం, విజయదశమి పండుగలు ఆదివారం రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది. దీంతో ప్రభుత్వోద్యోగులు ఉసూరు మంటున్నారు. ఐచ్ఛిక సెలవు అయిన బసవ జయంతి కూడా ఆదివారమే రావడం కూడా వారిని నిరాశకు గురిచేస్తోంది.

కాగా, వచ్చే ఏడాదికి సంబంధించి సాధారణ ఐచ్ఛిక సెలవులను ఏపీ ప్రభుత్వం నిన్న ప్రకటించింది. దాని ప్రకారం.. జనవరి 14న మంగళవారం భోగి, 15న బుధవారం సంక్రాంతి, 16న గురువారం కనుమ పండుగలు రాగా, ఫిబ్రవరి 21న శుక్రవారం మహాశివరాత్రి, మార్చి 25న బుధవారం ఉగాది, ఏప్రిల్ 2న గురువారం శ్రీరామ నవమి, 10న శుక్రవారం గుడ్‌ఫ్రైడే, 14న మంగళవారం అంబేద్కర్ జయంతి, 25న సోమవారం రంజాన్, ఆగస్టు 1న శనివారం బక్రీద్, 11న మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 22న శనివారం వినాయక చవితి, అక్టోబరు 2న శుక్రవారం గాంధీ జయంతి, 24న శనివారం దుర్గాష్టమి, 30న శుక్రవారం మిలాద్ ఉన్ నబీ, డిసెంబరు 25న శుక్రవారం క్రిస్మస్.

More Telugu News