Asha Devi: తెలంగాణ పోలీసులపై కేసు పెడితే మరో ఉద్యమం: నిర్భయ తల్లి హెచ్చరిక

  • పోలీసులు సరైన పని చేశారు
  • వారు విధించిన శిక్షతో సంతోషం కలిగింది
  • వారిపై విచారణ ఉండరాదని ఆశాదేవి డిమాండ్

దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై ఎటువంటి విచారణ ఉండరాదని నిర్భయ తల్లి ఆశాదేవి డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ వార్తను గురించి తెలుసుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలని భావించినా, మరో ఉద్యమం మొదలవుతుందని ఆమె హెచ్చరించారు. పోలీసులు విధించిన శిక్షను చూసి తానెంతో సంతోషించానని, వారు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని కొనియాడిన ఆమె, ఈ ఘటనతో మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి ఓ కఠిన హెచ్చరిక వెళ్లిందని అన్నారు.

పోలీసులపై ఏ విధమైన కేసులు పెట్టరాదని, విచారించరాదని ఆశాదేవి అభిప్రాయపడ్డారు. తాను న్యాయం కోసం గత ఏడేళ్ల నుంచి కోర్టు స్తంభాలను పట్టుకుని ఉన్నానని, ఇప్పటికీ నిందితులకు శిక్ష అమలు కాలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థ నేరస్తులను శిక్షించడంలో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తన కుమార్తెను చంపిన వారిని సాధ్యమైనంత త్వరగా ఉరి తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

More Telugu News