Priyanka chopra: ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది: ప్రియాంకా చోప్రా

  • 15 ఏళ్లుగా బాలల హక్కుల గుడ్ విల్ సంస్థకు ఆమె అంబాసిడర్
  • న్యూయార్క్ లో అవార్డు అందుకున్న ప్రియాంక
  • ప్రియాంక సేవా గుణం తనకు స్ఫూర్తి అన్న భర్త

వెండితెర నటిగా ప్రేక్షకులను అలరించడమే కాదు.. సామాజిక సేవలో తదైన ముద్రను వేసిన బాలీవుడ్ నటి  ప్రియాంకా చోప్రాను ప్రతిష్ఠాత్మకమైన ‘డేనీ కాయే హ్యూమానిటేరియన్’ అవార్డు వరించింది. గత 15 సంవత్సరాలుగా  ఆమె లాభాపేక్ష లేకుండా యూనిసెఫ్ కు చెందిన బాలల హక్కుల గుడ్ విల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

న్యూయార్క్ లో మంగళవారం  జరిగిన యూనిసెఫ్ స్నోఫేక్ బాల్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డయాన్ వాన్ ఫర్ స్టెన్ బర్గ్ ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ సంతోషకర క్షణాలను ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తనకు ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందంటూ ఆమె పోస్ట్ చేశారు. తన భార్య చేస్తున్న సేవా కార్యక్రమాలు తనకు కూడా స్ఫూర్తి దాయకంగా ఉంటాయని, ప్రియాంకకు ఈ గౌరవం దక్కడం తనకు ఎంతో సంతోషాన్నికలిగించిందని ఆమె భర్త నిక్ జోనాస్ తన స్పందనను తెలియజేశారు.

More Telugu News