Ganguly: తన బయోపిక్ కోసం హృతిక్ రోషన్ పేరును సూచించిన గంగూలీ

  • బయోపిక్ పై గంగూలీ ఆసక్తి
  • క్రీడాకారుల బయోపిక్ లకు విశేష ప్రేక్షకాదరణ
  • దంగల్, ఎంఎస్ ధోనీ చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు

క్రీడాకారుల బయోపిక్ తీస్తే విజయం ఖాయమని దంగల్, ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ వంటి చిత్రాలు నిరూపించాయి. భారత్ కు తొలి ప్రపంచకప్ అందించిన లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా మరో బయోపిక్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా తన బయోపిక్ పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా తన జీవితం ఆధారంగా సినిమా తీస్తే అందులో హృతిక్ రోషన్ తన పాత్ర పోషించడాన్ని ఇష్టపడతానని గంగూలీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హృతిక్ తన అభిమాన హీరో అని, తన బయోపిక్ కు అతడే కరెక్ట్ అని భావిస్తున్నానని వెల్లడించారు.

More Telugu News