India: టీమిండియా ఆటగాళ్లను వదలని అబ్దుల్ రజాక్... కెప్టెన్ పై వ్యాఖ్యలు!

  • బుమ్రాపై వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన పాకిస్థాన్ మాజీ క్రికెటర్
  • ఈసారి కోహ్లీ లక్ష్యంగా వ్యాఖ్యలు
  • కోహ్లీకి సచిన్ స్థాయి లేదన్న అబ్దుల్ రజాక్

పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి. కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పెళ్లికి ముందు చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉండేవని గొప్పగా చెప్పుకున్నాడు.

కొన్నిరోజుల కిందట తనకే సాధ్యమైన రీతిలో,  టీమిండియా పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా తన ముందు ఓ బచ్చా అంటూ నోటి దురుసు ప్రదర్శించాడు. మెక్ గ్రాత్, వసీం అక్రమ్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్న తాను బుమ్రా బౌలింగ్ ను ఉతికారేస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో తలంటారు. దాంతో అబ్దుల్ రజాక్ తన దృష్టిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సారించాడు.

కోహ్లీ పరుగులు సాధించే ఆటగాడే కానీ, సచిన్ టెండూల్కర్ స్థాయి అతనికి లేదన్నాడు. కోహ్లీ టీమిండియాకు ఎంతో ఉపయుక్తమైన ఆటగాడని, కానీ సచిన్ తో పోల్చదగినవాడు కాదని అభిప్రాయపడ్డాడు. మరి దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి!

More Telugu News