Prabhas: ఆసియా అత్యంత శృంగార పురుషుల జాబితాలో ప్రభాస్ కు స్థానం!

  • పదో స్థానంలో ప్రభాస్
  • హృతిక్ రోషన్ అగ్రస్థానం
  • సర్వే నిర్వహించిన బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్ట్రన్ ఐ

బాహుబలి చిత్రాల ద్వారా ప్రభాస్ కు అంతర్జాతీయస్థాయిలో కూడా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా, ప్రభాస్ కు అభిమానులు ఆసియా అత్యంత శృంగార పురుషుల జాబితాలో 10వ స్థానం కట్టబెట్టారు. బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్ట్రన్ ఐ  సంస్థలు నిర్వహించిన సర్వేలో ప్రభాస్ కు భారీగా ఓట్లు పోలయ్యాయి. ఆసియా 'అత్యంత శృంగార పురుషుడు-2019' పేరిట ఆన్ లైన్ లో సర్వే నిర్వహించగా, తాజాగా ఫలితాలు వెల్లడించారు.

ఈ లిస్టులో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ మొదటిస్థానంలో నిలిచాడు. టాప్-5లో ఆ తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, టీవీ నటుడు వివియన్ డిసేనా, బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్, బ్రిటీష్ ఏషియన్ పాప్ స్టార్ జయన్ మాలిక్ నిలిచారు. ఇక సినిమాలకు సంబంధించిన ప్రముఖులే ఎక్కువగా ఉన్న టాప్-10లో ఉన్న ఏకైక క్రీడాకారుడు విరాట్ కోహ్లీనే. కోహ్లీకి 7వ స్థానం లభించింది.

More Telugu News