TTD: జగన్‌ పెద్ద మెజారిటీతో సీఎం అయ్యారు.. ఇప్పుడు పవన్‌ కల్యాణ్ ఒప్పుకోకపోవడం ఏమిటి?: ఎద్దేవా చేసిన సినీనటుడు పృథ్వీ

  • పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు
  • ఏపీలో 150కి పైగా సీట్లు ఇచ్చి జగన్‌ను ప్రజలు సీఎంను చేశారు
  • ఏ హిందూ దేవాలయంలోనూ అన్యమత ప్రచారం జరగడంలేదు

వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా ఒప్పుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనడం సరికాదని ఎస్వీబీసీ ఛైర్మన్, సినీనటుడు పృథ్వీరాజ్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో 150కి పైగా సీట్లు ఇచ్చి, జగన్‌ను ప్రజలు సీఎంను చేశారని ఆయన గుర్తు చేశారు. ఇంత మెజారిటీతో జగన్ సీఎం అయ్యారని, ఆయనను సీఎంగా పవన్‌ ఒప్పుకోకపోవడం ఏమిటని చురకలంటించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని విమర్శించారు.

ఏ హిందూ దేవాలయంలోనూ అన్యమత ప్రచారం జరగడంలేదని పృథ్వీ అన్నారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే కొందరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు ఎవరి వ్యక్తిగత విషయాలపై కూడా మాట్లాడడం లేదని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీల నేతలే తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలని, ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని హితవు పలికారు.

More Telugu News