Student: ఒక అక్షరం తప్పురాసినందుకు.. 9వ తరగతి విద్యార్థి వీపు విమానం మోత!

  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • ఆగ్రహంతో చితక్కొట్టిన సెయింట్ పాల్స్ స్కూల్ యజమాని
  • పోలీసులకు బాధిత విద్యార్థి తల్లి ఫిర్యాదు

తొమ్మిదో తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి, ట్యూషన్ లో 'ఆకలి' బదులు 'అకలి' అని రాయడంతో స్కూల్ యజమాని చితక్కొట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

మండల పరిధిలోని సెయింట్‌ పాల్స్‌ స్కూల్ లో సంజయ్ అనే విద్యార్థి, తొమ్మిదో తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. సాయంత్రం వేళ ట్యూషన్‌ సమయంలో తెలుగు పదంలో ఓ అక్షరం తప్పు రాశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్కూల్ యజమాని బబ్లూ, బలమైన కర్రతో వీపుపై వాతలు తేలేలా కొట్టాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తీవ్ర గాయాలు కావడంతో భీతిల్లిన సంజయ్, విషయాన్ని తన తల్లికి చేరవేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, బబ్లూపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. 

More Telugu News