Abudabi: షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చిన్నబుచ్చుకున్న చిన్నారి... ఇంటికెళ్లి ముచ్చట తీర్చిన అబూదాబి యువరాజు... వీడియో ఇదిగో!

  • విందుకు హాజరైన అబూదాబీ యువరాజు
  • కరచాలనం కోసం లైన్లో నిలబడ్డ బాలిక
  • పట్టించుకోకుండా వెళ్లిపోయిన యువరాజు
  • వైరల్ అయిన వీడియోను చూసి బాలిక ఇంటికి

తమ రాజును కలవాలని, వీలైతే అతనితో చెయ్యి కలపాలని ఎవరికి మాత్రం ఉండదు? అటువంటి ఆలోచనతోనే ఉన్న ఓ చిన్నారి, తన పక్కనున్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన యువరాజు, తనను మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై చిన్నబుచ్చుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యువరాజు స్వయంగా పాప ఇంటికి వెళ్లి, ఆమెతో మాట్లాడి, చేతిని ముద్దాడి, షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చట తీర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఆ యువరాజు అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ కాగా, చిన్నారి పేరు ఐశా మహమ్మద్‌ మషీత్‌ అల్‌ మజ్‌రౌవీ. జాయెద్ ఓ విందుకు హాజరైన వేళ ఈ ఘటన జరిగింది. యువరాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పరుగున వచ్చి వరుసలో నిలబడిన ఐశా, తన కోరిక తీరకపోవడంతో చిన్నబుచ్చుకుంది. ఆ సమయంలో తీసిన వీడియోను చూసిన జాయెద్, ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో ఐశా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చిన్నారి పట్ల యువరాజు వ్యవహరించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

More Telugu News