Tirumala: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఖాళీ... ఈజీగా దైవదర్శనం చేసుకుంటున్న భక్తులు!

  • బోసిపోయిన క్యూ కాంప్లెక్స్
  • భారీ వర్షాలు, పెరిగిన చలే కారణం!
  • రేపటి నుంచి రద్దీ పెరిగే అవకాశం

ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండే తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బోసిపోయింది. ఈ ఉదయం 5 గంటలకు కేవలం ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి వున్నారు. వారికి ఆరు గంటల సమయంలోనే దర్శనం పూర్తకాగా, ఆపై వచ్చిన వారు వచ్చినట్టు క్యూలైన్లో ఆలయంలోకి వెళుతున్న పరిస్థితి.

భారీ వర్షాలు, చలి పెరగడం తదితర కారణాలతో భక్తుల రద్దీ మందగించిందని అధికారులు భావిస్తున్నారు. రేపటి నుంచి వారాంతం కానుండటంతో భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రత్యేక ప్రవేశం, దివ్య దర్శనం భక్తులకు రెండు గంటల వ్యవధిలో స్వామి దర్శనం అవుతోంది. నిన్న స్వామివారిని సుమారు 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News