Visakhapatnam - Gajuwaka: విశాఖలో దారుణం.. వివాహితపై యాసిడ్ దాడి

  • రోడ్డుపై నడిచివెళుతుండగా యాసిడ్ చల్లిన దుండగుడు
  • ముఖం, చేతులకు తీవ్ర గాయాలు
  • చికిత్సకోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు

విశాఖ పట్టణం నగరంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ మహిళపై ఓ దుండగుడు యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ  బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు ఆమెను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. మహిళ ముఖం, చేతులు కాలినట్లు వైద్యులు గుర్తించారు.

More Telugu News