Gold Prices Increased: మళ్లీ పెరిగిన బంగారం ధర

  • ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.39,299
  • కిలో వెండి ధర రూ.46,672గా నమోదు
  • అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,483 డాలర్లు

ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈ రోజు 332 రూపాయలు పెరిగి రూ.39వేల మార్క్ ను మించిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.39,299 పలికింది. అటు వెండి ధరలో కూడా అదే తీరు కనిపించింది. ఈ రోజు కిలో వెండి ధరలో 676 రూపాయల పెరుగుదల నమోదయింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.46,672 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,483 డాలర్లు పలుకగా, ఔన్సు వెండి ధర 17.27 డాలర్లుగా ట్రేడయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ట్రేడ్ వార్ పరిస్థితులు, ఆర్థిక మందగమనం దృష్ట్యా మదుపుదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించడం, డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి కారణాల నేపథ్యంలో దేశీయంగా పసిడి, వెండి ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.

More Telugu News