Disha: ‘దిశ’ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

  • దిశ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
  • మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు

దిశ కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.

హైకోర్టు స్పందన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ దీనిపై కసరత్తు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును మహబూబ్ నగర్ లో ఉర్పాటు చేసేందుకు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ త్వరితగతిన సాగనుంది. రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇటీవల వరంగల్ లో ఓ బాలిక హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా... కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై, తీర్పు వెలువడింది.

More Telugu News