Amaravathi: ‘ప్రజా రాజధాని అమరావతి’ పేరిట రేపు రౌండ్ టేబుల్ సమావేశం: అచ్చెన్నాయుడు

  • 17 పార్టీలకు, ప్రజా సంఘాలకు ఆహ్వానం పంపాం
  • సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా సమావేశం
  • రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం చంపేసింది

ప్రజా రాజధాని అమరావతి’ పేరిట రేపు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపటి సమావేశం నిమిత్తం 17 పార్టీలకు, ప్రజా సంఘాలకు ఆహ్వానం పంపినట్టు చెప్పారు. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం చంపేసిందని ఆరోపించారు. రాజధాని విషయమై మంత్రులు ఎవరికిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుంటే, సీఎం జగన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మౌనంగా వుండటం కూడా కుట్రలో భాగమేనని అన్నారు. ఆరు నెలల జగన్ పాలనలో అమరావతిలో ప్రభుత్వం తట్టెడు మట్టి పని కూడా చేయలేదని, ఈ రాజధాని ఒకట్రెండు జిల్లాలకే పరిమితమని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజధాని అనేది రాష్ట్రానికి ఆదాయవనరు అన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని అచ్చెన్నాయుడు సూచించారు.

More Telugu News