Shiva: దూసుకుపోతున్న 'చూసీ చూడంగానే' ట్రైలర్

  • తెలుగు తెరకి మరో ప్రేమకథ
  • కథానాయకుడిగా శివ పరిచయం 
  • నాయికలుగా వర్ష - మాళవిక    

తెలుగు తెరను మరో ప్రేమకథా చిత్రం పలకరించనుంది .. ఆ సినిమా పేరే 'చూసీ చూడంగానే'. శేష సింధు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. ఆయన తనయుడు శివ కందుకూరి ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. శివ సరసన వర్ష - మాళవిక కథానాయికలుగా నటిస్తున్నారు.

నిన్న విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ప్రేమ .. ప్రేమికుల మధ్య అలకలు .. గొడవలు .. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషన్స్ తో ఈ ట్రైలర్ సాగింది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

More Telugu News