Viral Videos: మూడో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి.. క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్

  • డామన్‌ డయ్యూలో ఘటన
  • బాలుడు పడిపోతోన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు
  • సురక్షితంగా కాపాడిన యువకుడు

మూడో అంతస్తు నుంచి ఓ చిన్నారి (2) పడిపోయే స్థితిలో ఉన్నాడు.. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడిని క్యాచ్ పట్టుకోవాలని చూశారు. ఇంతలో ఆ బాలుడు కిందపడిపోయాడు.. కింద ఉన్న యువకుల్లో ఒకరు ఆ చిన్నారిని క్యాచ్ పట్టి ప్రాణాలు రక్షించారు. ఆ బాలుడికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారిని క్యాచ్ పట్టగా తీసిన వీడియో బయటకు వచ్చింది.

ఈ ఘటన డామన్‌ డయ్యూలో గత రాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఆ బాలుడి ప్రాణాలు రక్షించిన యువకులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కింద ఉన్న యువకులు.. ఆ బాలుడిని గుర్తించకపోతే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయేవాడు. ఆ బాలుడు మూడో అంతస్తు నుంచి కిందకు ఎలా పడిపోయాడన్న విషయంపై స్పష్టత రాలేదు. 

More Telugu News