Balakrishna: బోయపాటితో రోజా ఇదేమాట చెప్పిందట!

  • బాలకృష్ణ తాజా చిత్రంగా రానున్న 'రూలర్'
  • బోయపాటితో సినిమాకి సన్నాహాలు 
  • రోజా నుంచి రెడ్ సిగ్నల్

బాలకృష్ణ కథానాయకుడిగా చేసిన 'రూలర్' ఈ నెలలో విడుదలకి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా'.. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. దాంతో సహజంగానే ఈ మూడో ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి.

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను రోజా చేయనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు లేడీ విలన్ గానే ఆమె కనిపించనుందని చెప్పుకున్నారు. రోజాతో సంప్రదింపులు జరిపిన మాట నిజమేనట. అయితే బాలకృష్ణ సినిమాలో చేయడం తనకి అంగీకారమేగానీ, ఈ తరహా పాత్రను మాత్రం చేయనని రోజా స్పష్టం చేసిందట. మరి ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.

More Telugu News