Mekathoti Sucharitha: మహిళల భద్రతకు సైబర్ మిత్ర తీసుకువచ్చాం: ఏపీ హోంమంత్రి సుచరిత

  • దిశ ఘటనతో మేల్కొన్న రాష్ట్రాలు
  • మహిళల భద్రతకు చర్యలు
  • సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయన్న సుచరిత

దిశ ఘటన తెలంగాణను మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలను మేల్కొలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ మహిళల భద్రతకు చర్యలు మొదలయ్యాయి. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, మహిళల భద్రతకు 'సైబర్ మిత్ర' విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆపద సమయాల్లో మహిళలు 100, 112, 181 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. విపత్కర సమయాల్లో మహిళలు 91212 11100 నంబరుకు వాట్సాప్ చేయొచ్చని మంత్రి వివరించారు. వీటితో పాటే 'బీ సేఫ్' యాప్ ద్వారా తక్షణసాయం పొందవచ్చని వెల్లడించారు.

More Telugu News