RTC strike: టీఎస్ ఆర్టీసీ సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన

  • సమ్మె విరమణతో మా ఉద్యోగాలు పోయాయి
  • సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పనిచేస్తున్న ఉద్యోగాలు వదిలి మరీ వచ్చాము
  • పర్మినెంట్ అయ్యే అవకాశం లభిస్తుందన్న ఆశతో పనిచేశాము

తెలంగాణలో ఆర్టీసీ చేపట్టిన సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసిన ఉద్యోగులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. దిల్ సుఖ్ నగర్ డిపో ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సమ్మె ముగియడంతో తాము ఉద్యోగాలు కోల్పోయామని.. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలకోసం నోటిఫికేషన్  విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాము అప్పటివరకు పనిచేస్తున్న ఉద్యోగాలు వదలి మరీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశామన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు తాత్కాలిక ఉద్యోగుల గురించి స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పర్మినెంట్ అయ్యే అవకాశం లభిస్తుందన్నఆశతో పనిచేశామన్నారు. ఈ విషయంలో తమకు బాధే మిగిలిందన్నారు.

More Telugu News