spg: ఎస్పీజీ భద్రత స్టేటస్ సింబల్ కాదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లు
  • ఈ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ
  • వ్యక్తులకు ఉన్న ముప్పు దృష్ట్యా కల్పించే భద్రత ఇది

ఎస్పీజీ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రాజ్యసభలో నిర్వహించిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వ్యక్తులకు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని కల్పించేది ఎస్పీజీ భద్రత అని, అది స్టేటస్ సింబల్ కాదని అన్నారు. కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి ఎస్పీజీ భద్రత కల్పించాలనేది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

More Telugu News