Nagachaitanya: శేఖర్ కమ్ముల సినిమాకి విడుదల తేదీ ఖరారు

  • చైతూ - సాయిపల్లవి జోడీగా 'లవ్ స్టోరీ'
  • తెలంగాణ యువకుడిగా చైతూ 
  • ఏప్రిల్ 2వ తేదీన విడుదల

శేఖర్ కమ్ముల సినిమాలు లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో నడుస్తుంటాయి. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా ఆయన ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కథను బట్టి ఈ సినిమాకి 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో వున్నారు.

ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. నారాయణదాస్ నారంగ్ .. రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో చైతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపించనున్నాడు. విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.

More Telugu News