Ramajogayya sastri: సింగర్ ను అవ్వాలని కోరికగా వుండేది: గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

  • బాలసుబ్రహ్మణ్యం గారు నాకు స్ఫూర్తి 
  • కాలేజ్ డేస్ లో పాటలు బాగా పాడేవాడిని 
  • గాయకుడిగా రాణించాలని ఉండేదన్న శాస్త్రి

తెలుగులో గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రికి మంచి పేరు వుంది. నటనపట్ల గల ఆసక్తితో ఆయన చిన్న చిన్న పాత్రల్లోను కనిపిస్తున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. "నేను గేయరచయితను అవుదామనిగానీ .. నటుడిని అవుదామనిగాని అనుకోలేదు. మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఈ విషయంలో నాకు బాలసుబ్రహ్మణ్యం గారే స్ఫూర్తి.

'వయసు పిలిచింది' సినిమాలో బాలు గారి 'హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గ' పాట విన్న దగ్గర నుంచి గాయకుడిని కావాలనే ఆసక్తి మొదలైంది. కాలేజ్ డేస్ లో స్టేజ్ పై పాటలు బాగా పాడేవాడిని. చెన్నైకి వెళ్లి బాలు .. మనో మాదిరిగా గాయకుడిగా రాణించాలని అనుకునేవాడిని. కానీ నాకు చెన్నైలో కాకుండా బెంగళూర్లో జాబ్ వచ్చింది. అక్కడివాళ్లు నన్ను లిరిక్ రైటర్ గా ప్రోత్సహించారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News