Tamilnadu: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

  • తమిళనాడులో భారీ వర్షాల ప్రభావం
  • 2 కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి 3 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటం, ముఖ్యంగా తమిళనాడులో పడుతున్న భారీ వర్షాలకు భక్తుల రాక మందగించింది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనానికి కేవలం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, దర్శనానికి వారికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్‌ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని తెలిపారు. సోమవారం నాడు 80,474 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 25,062 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లుగా నమోదైంది.

More Telugu News