Posani Krishna Murali: వాళ్లతో పోల్చితే ఆ నలుగురు ఏమంత పెద్ద క్రిమినల్స్ కాదు: పోసాని

  • దిశ ఘటనపై స్పందించిన పోసాని
  • తనదైన శైలిలో వ్యాఖ్యలు
  • ఆ నలుగుర్ని చంపితే 130 కోట్ల మందిలో మార్పు వస్తుందా అన్న పోసాని

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ హత్య వ్యవహారంపై ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో స్పందించారు. ఈ ఘటనలో నిందితులైన నలుగురు కుర్రాళ్లు పెద్ద క్రిమినల్స్ కాదని, మనం ఎన్నుకుంటున్న కొందరు నేతలు, మనం నియమించుకుంటున్న కొందరు పోలీసులు, మనం కొలిచే కొందరు బాబాలతో పోల్చితే వీళ్లు పెద్ద నేరస్తులు కారని అన్నారు. వాళ్లను చంపినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయా? అంటూ.... అత్యాచారం చేశారు కాబట్టి చంపేయాలంటున్నారని, ఆ నలుగుర్నీ చంపినా ఇలాంటి వాళ్లు బయట కోట్ల మంది ఉన్నారని, మరి వాళ్లనేం చేస్తారని ప్రశ్నించారు.

అరబ్ దేశాల తరహాలో ఇక్కడ కూడా శిక్షలు అమలు చేయాలంటున్నారని, కానీ అరబ్ దేశాల్లో చట్టాలతో పాటు మనుషులు కూడా కరెక్ట్ గా ఉంటారని అందుకే అక్కడ నేరాల సంఖ్య తక్కువని వెల్లడించారు. ఆ నలుగురు నిందితులన్నీ చంపినంత మాత్రాన 130 కోట్ల మందిలో మార్పు రాదని పోసాని అభిప్రాయపడ్డారు.

More Telugu News