Nirbhaya: నిర్భయ నిందితుడికి క్షమాభిక్ష వద్దంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్

  • ఏడేళ్ల కిందట నిర్భయ ఘటన
  • దోషులకు మరణ శిక్ష విధించిన కోర్టు
  • క్షమాభిక్ష కోరిన వినయ్ శర్మ

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు కావస్తోంది. ఈ కేసులో కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ, తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు.

దీనిపై జాతీయ మహిళా కమిషన్ తాజాగా స్పందిస్తూ, వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాసింది. దోషిగా నిరూపితమైన వినయ్ శర్మకు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఇవ్వవద్దని కోరింది. ఇటీవలి దిశ ఘటన నేపథ్యంలో, అత్యాచార ఘటనలపై త్వరితగతిన విచారణ జరిగేలా కేంద్రాన్ని ఆదేశించాలని తన లేఖలో విజ్ఞప్తి చేసింది. రివ్యూ పిటిషన్ల పరిశీలనకు కాలపరిమితి విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది.

More Telugu News