Mahesh Babu: ఏఎంబీ సినిమాస్ కు హ్యాపీ బర్త్ డే: మహేశ్ బాబు

  • ఏఎంబీ సినిమాస్ ప్రారంభమై నేటితో సంవత్సరం
  • ట్విట్టర్ లో స్పందించిన మహేశ్ బాబు
  • ఏఎంబీ టీమ్ కు అభినందనలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మితమైన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఏఎంబీ సినిమాస్ కు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వెరీ హ్యాపీ బర్త్ డే ఏషియన్ సినిమాస్ అంటూ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమించి ఏఎంబీ సినిమాస్ ను ఈ స్థాయికి తెచ్చిన ఏఎంబీ టీమ్ కు శుభాభినందనలు. ఏఎంబీ సినిమాస్ నేడు ఈ స్థాయిలో ఉందంటే అది మీ చలవే అంటూ స్పందించారు.

More Telugu News