Nara Lokesh: గుడి, బడి, ఆఖరికి శ్మశానాన్ని కూడా వదలకుండా కాదేదీ రంగుకు అనర్హం అంటున్నారు వైఎస్ జగన్ గారు: నారా లోకేశ్

  • అన్నింటికీ వైసీపీ రంగులేస్తున్నారని మండిపాటు
  • వైసీపీ కార్యాలయాల్లా మార్చేస్తున్నారని ఆగ్రహం
  • రూ.1300 కోట్ల ప్రజాధనం ఎక్కడి నుంచి వచ్చిందన్న లోకేశ్

శ్మశానాలతో ప్రారంభించి ఆలయాలకు, స్కూళ్లకు అన్నింటికీ వైసీపీ రంగులేస్తున్నారని, కాదేదీ రంగుకు అనర్హం అని వైఎస్ జగన్ గారు భావిస్తున్నారని నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. రైతులకు భరోసా ఇవ్వడానికి మనసు రాక నెలకు రూ.625 మాత్రమే ఇస్తున్నారని, వృద్ధులకు పింఛను ఇవ్వడానికి చేతలు రాక రూ.250 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. ఎందుకని అడిగితే, రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్నారని, కానీ కనిపించిన ప్రతిదానికి రంగులు వేయడానికి రూ.1300 కోట్ల ప్రజాధనం ఎక్కడి నుంచి వచ్చిందో వైసీపీ నాయకులు చెప్పగలరా? అని నిలదీశారు.

విద్యార్థులు దేవాలయంగా భావించే ప్రభుత్వ పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో మహామేత విగ్రహాలు ఏర్పాటు చేస్తూ, వైసీపీ రంగులు వేస్తూ పార్టీ కార్యాలయాల్లా మార్చుకోవడం కంటే దారుణమైన చర్య మరొకటి ఉండదని లోకేశ్ విమర్శించారు.

More Telugu News