Lok Sabha: వెంటనే శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగవు: లోక్ సభలో ఎంపీ బండి సంజయ్

  • సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన
  • వెంటనే శిక్షలు అమలు చేయాలి
  • సంవత్సరాల కొద్దీ విచారణలు జరగొద్దు
  • ప్రజల్లో ఆలోచన వచ్చింది

హైదరాబాద్ లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా చెడు వాతావరణాన్ని తీసుకొచ్చిందని లోక్ సభలో ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని అన్నారు. దిశ ఘటనపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... 'క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పర్చడంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతోంది. వెంటనే శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగవు. సంవత్సరాల కొద్దీ విచారణలు జరగకూడదు' అని వ్యాఖ్యానించారు.

'దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా దీనిపై ఆలోచించాలి. దిశ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందించాలన్న ఆలోచన వచ్చింది. అయితే, మనమంతా ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాం. ఇటువంటివి జరగకుండా ఏం చేయాలన్న విషయంపై చర్చ జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి' అని అన్నారు. 

More Telugu News