అత్యాచార యత్నం చేయబోతే ఎదురు తిరిగిన విద్యార్థిని.. తీవ్రంగా కొట్టిన దుండగులు

02-12-2019 Mon 11:29
  • శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఘటన 
  • ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న యువతి 
  • పోలీసుల అదుపులో నిందితులు

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కొందరు మృగాళ్ల దాష్టీకం ఒకటి వెలుగు చూసింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కొందరు యువకులు, ఆమె తిరగబడడంతో తీవ్రంగా కొట్టిన సంఘటన ఇది. 


పోలీసుల కథనం మేరకు... స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఈ విద్యార్థినిని కొందరు యువకులు అడ్డుకున్నాడు. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేశారు. దీంతో కంగుతిన్న బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకుని బాధితురాలిని అసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.