Chiranjeevi: బ్యాంకాక్ లో చిరూ మూవీ మ్యూజిక్ సిటింగ్స్

  • చిరంజీవి 152వ సినిమాకి సన్నాహాలు 
  • కథానాయికగా తెరపైకి త్రిష పేరు 
  •  త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు

చిరంజీవి 152వ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగును ప్రారంభించనున్నారు. అందువలన అన్నిపనులను వేగంగా ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారు. ఆయన బ్యాంకాక్ చేరుకుని అక్కడున్న ఓ ప్రైవేట్ రిసార్టులో కొత్త బాణీలపై కసరత్తు చేస్తున్నారు.

చిరంజీవి .. కొరటాల కూడా ఈ పనిపై అక్కడికి చేరుకున్నారని అంటున్నారు. గతంలో చిరంజీవికి మణిశర్మ ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చి వున్నాడు. అందువలన ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలపాలనే పట్టుదలతో వున్నాడు. ఇప్పటికే సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది. మిగతా పాత్రల కోసం నటీనటుల ఎంపికను త్వరలోనే పూర్తి చేయనున్నారు.

More Telugu News