petrol: ఖాళీ బాటిళ్లతో పెట్రోల్ కోసం వస్తే వారి ఫొటో తీయండి: శంషాబాద్ డీసీపీ ఆదేశాలు

  • పెట్రోలు బంక్‌లకు నోటీసులు జారీ చేస్తున్నాం
  • బాటిళ్లలో పెట్రోల్ పోసిచ్చే బంక్ ల యాజమాన్యాలపై చర్యలు 
  • బాటిళ్లతో వచ్చి పెట్రోల్ అడిగే వారి వివరాలను తీసుకోవాలి

తహసీల్దార్ విజయారెడ్డి, దిశ ఘటనలతో పెట్రోల్ బంకుల్లో ఖాళీ బాటిళ్లలో పెట్రోలు విక్రయాలపై పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోల్ పోసి విక్రయించే బంక్ ల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తప్పవని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అంతేకాదు, ఖాళీ బాటిళ్లతో వచ్చి పెట్రోల్ అడిగే వారి వివరాలను బంకుల సిబ్బంది తీసుకోవాలని, వారి ఫొటోను కూడా స్మార్ట్ ఫోన్ లో తీయాలని చెప్పారు.

ఈ మేరకు తమ జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులు జారీ చేస్తున్నామని వివరించారు. తాము చేస్తోన్న సూచనలను పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని తెలిపారు. బంక్ యజమానులు, నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వివరించారు.

More Telugu News