Nidhi Agarwal: నీలాంటి వారివల్లే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారన్న నెటిజెన్ కు ఘాటుగా బదులిచ్చిన నిధి అగర్వాల్

  • సోషల్ మీడియాలో హాట్ ఫొటోను షేర్ చేసిన నిధి
  • మరోసారి ఇలా కనిపించొద్దన్న నెటిజెన్
  • అతని ఆలోచనా విధానం షాక్ కు గురి చేసిందన్న నిధి

తమ సోషల్ మీడియా ఖాతాల్లో సినీ భామలు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేయడం పరిపాటే. తాజాగా నిధి అగర్వాల్ తనకు చెందిన ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోపై ఓ నెటిజెన్ మండిపడ్డాడు. నీలాటి వారివల్లే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఇంకొక సారి ఇలా హాట్ గా కనిపించొద్దు అని సూచించాడు. దీనిపై నిధి అగర్వాల్ ఘాటుగా స్పందించింది. ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్ కు గురి చేసిందని చెప్పింది. మీ అడ్రస్ పంపండి... మీకు 'పింక్' అనే సినిమాను పంపిస్తానని తెలిపింది. ఈ సినిమాను మీరు చూడాల్సిన అవసరం ఉంది అంటూ కౌంటర్ వేసింది.

More Telugu News