India: భారత క్రికెట్లో మళ్లీ బుకీల కలకలం!

  • దేశవాళీ టోర్నీలో ఓ ఆటగాడ్ని బుకీ కలిశాడన్న గంగూలీ
  • ఏసీయూకి ఫిర్యాదు అందిందని వెల్లడి
  • ఆటగాడి పేరు తనకు తెలియదన్న గంగూలీ

భారత క్రికెట్ లో కొన్నాళ్ల క్రితం ఐపీఎల్ ఫిక్సింగ్ భూతం తీవ్ర అప్రదిష్టకు కారణమైంది. కొందరు ఆటగాళ్లను కూడా సస్పెండ్ చేశారు. సదరు ఆటగాళ్లు జైల్లోనూ ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ భారత్ లో ఫిక్సింగ్ మాట పెద్దగా వినిపించలేదు. తాజాగా, సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ క్రికెట్ టోర్నీలో బుకీల కలకలం రేగింది. ఓ ఆటగాడ్ని బుకీ సంప్రదించినట్టు తెలిసిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు.

ఈ వ్యవహారంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీయూ)కి ఫిర్యాదు కూడా అందిందని వెల్లడించారు. అయితే ఆ ఆటగాడి పేరు తనకు తెలియదని చెప్పిన గంగూలీ, ఓ ఆటగాడ్ని బుకీలు సంప్రదించడం ఇక్కడ సమస్య కాదని, బుకీలు సంప్రదించిన తర్వాత ఆటగాళ్లు ఏంచేస్తారన్నదే సమస్య అని పేర్కొన్నారు.

More Telugu News