Web series: వెబ్ సిరీస్ ‘క్వీన్’ టీజర్ విడుదల

  • దివంగత సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా సిరీస్
  • గౌతమ్ మీనన్, మురుగేశన్ దర్శకత్వంలో ‘క్వీన్’
  • జయలలిత పాత్రను పోషిస్తున్న రమ్యకృష్ణ, అనిఖా సురేంద్రన్  

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అలనాటి నటి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’. గౌతమ్ మీనన్, మురుగేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘స్టేట్ టాపర్ ఇన్ స్కూల్’, ‘సూపర్ స్టార్ హీరోయిన్ ఎట్ 18’, ‘స్టేట్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్’ అనే వాక్యాలు ఆ టీజర్ లో కనబడతాయి.

కాగా, ఈ వెబ్ సిరీస్ లో జయలలిత పాత్రను ఇద్దరు నటీమణులు పోషిస్తున్నారు. చిన్న వయసులో జయలలితగా నటి అనిఖా సురేంద్రన్, రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత పాత్రలో రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ నెల 5న క్వీన్ ట్రైలర్ విడుదల కానుంది.

More Telugu News