Telangana: సీఎం కేసీఆర్ సార్, మాకు చాలా సంతోషమైన వార్తలందించాడు: ఆర్టీసీ కార్మికులు

  • సీఎం కేసీఆర్ వరాల జల్లుపై కార్మికుల స్పందన
  • సంస్థను లాభాల బాటలోకి తెస్తాం
  • సార్ కు జీవితాంతం రుణపడి వుంటాం

సీఎం కేసీఆర్ తమపై వరాల జల్లు కురిపించడంపై టీఎస్సార్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం ముగిసిన అనంతరం, వారు ఇంటికి తిరిగి బయలుదేరారు. ఈ సందర్భంగా వారిని మీడియా పలకరించింది.
 
‘మీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారు?’ అన్న ప్రశ్నకు ఓ కార్మికురాలు మాట్లాడుతూ, ‘సీఎం సార్ మాకు చాలా సంతోషమైన వార్తలందించాడు. మేము అనుకున్న దాని కన్నా ఎక్కువ సలహాలు ఇచ్చాడు. ఇంకా ఇస్తానని చెప్పాడు. మీరు (కేసీఆర్) అనుకున్నట్టు సంస్థను లాభాల బాటలో తెస్తాం.. సాధ్యమైనంత వరకూ లాభాల బాటలో నడిపిస్తాం’ అని అన్నారు.

మరో కార్మికుడు మాట్లాడుతూ, ముఖ్యంగా, తమకు ఉద్యోగభద్రత అవసరం అని, ఈరోజున కేసీఆర్ చారిత్రకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తామని, సమ్మె కాలంలో చనిపోయిన కుటుంబాల్లో వ్యక్తులకు వారం రోజుల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామనిరు, రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పారని.. తాము చాలా సంతోషంగా వున్నామని, చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ‘మాకు ఇన్ని వరాలు ఇచ్చిన సార్ కు జీవితాంతం రుణపడి వుంటాం’ అని అన్నారు.

More Telugu News