Ganguly: వచ్చే ఐదేళ్లూ గంగూలీనే బీసీసీఐ చీఫ్... బోర్డు రాజ్యాంగంలో మార్పు!

  • ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ
  • లోథా కమిటీ సంస్కరణల మార్పుకు ప్రయత్నం
  • ఆమోదం తెలిపిన బోర్డు సభ్యులు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తన పూర్తికాలం వ్యవహరించేందుకు మార్గం సుగమం అయింది. లోథా కమిటీ సంస్కరణల ప్రకారం భారత క్రికెట్ వ్యవస్థల్లో వరుసగా 6 ఏళ్ల పాటు పదవుల్లో ఉన్న వ్యక్తి మరోసారి పదవి చేపట్టాలంటే మూడేళ్ల విరామం తప్పనిసరి. గంగూలీ 2015 నుంచి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన ఆ పదవిలో ఉండగానే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లోథా కమిటీ సంస్కరణల ప్రకారం గంగూలీ ఏడాది కంటే తక్కువ సమయంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి.

కానీ, గంగూలీ వచ్చీరావడంతోనే లోథా సంస్కరణలను మార్చడంపై దృష్టి పెట్టారు. సర్వసభ్య సమావేశం నిర్వహించి లోథా కమిటీ సంస్కరణల మార్పుపై సభ్యుల అభిప్రాయాన్ని కోరగా, అందరి ఆమోదం లభించింది. ఆ తీర్మానానికి సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేస్తే, ఇకపై గంగూలీ వచ్చే ఐదేళ్ల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అడ్డంకులు తొలగిపోతాయి.

More Telugu News