బెంగళూరులో ఆనియన్ దోసెలు క్యాన్సిల్... ఉల్లి కొరత ఎఫెక్ట్!

01-12-2019 Sun 14:38
  • దేశంలో ఉల్లికి విపరీతమైన డిమాండ్
  • రూ.100కి అటూఇటూగా ధర
  • బెంగళూరులోనూ ఉల్లి కష్టాలు!

దేశంలో ఉల్లిగడ్డల కొరత తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పటికే కేజీ ఉల్లిగడ్డలు రూ.100 పైన ధర పలుకుతున్నాయి. దాంతో బెంగళూరులోని చిన్నాచితకా హోటళ్లు, బండ్లపై ఆనియన్ దోసెలు వేయడం మానేశారు. అదేమని అడిగితే, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్నాయని సమాధానం వినిపిస్తోంది. ఏవో కొన్ని పెద్ద హోటళ్లలో మాత్రం ఉల్లి దోసెలు దర్శనమిస్తున్నాయి.

మరికొందరు హోటళ్ల యజమానులు మధ్యేమార్గంగా ఆనియన్ దోసెల్లో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా వేస్తూ పాత కస్టమర్లను నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఏదేమైనా కొండెక్కిన ఉల్లిధరలు కిందికి దిగివస్తేనే గానీ బెంగళూరు వాసుల బెంగ తీరేట్టు లేదు!