Dabang-3: విడుదలవుతూనే టాప్ లోకి వెళ్లిపోయిన సల్మాన్ సాంగ్... 'దబాంగ్-3' నుంచి 'మున్నా బద్నామ్ హువా' పాట ఇదిగో!

  • సల్మాన్ హీరోగా దబాంగ్-3
  • ఈ నెల 20న విడుదల
  • గంటల వ్యవధిలో కోటి వ్యూస్

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'దబాంగ్', 'దబాంగ్-2' ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాలను పవర్ స్టార్ పవన్ కల్యాణ్, 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్'గా తెలుగు ప్రేక్షకులకు అందించారు కూడా. ఇప్పుడు దబాంగ్ సిరీస్ లో మూడో భాగం ఈ నెల 20న క్రిస్మస్ కానుకగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో సల్మాన్ తో పాటు మమతా శర్మ నర్తించింది. 'మున్నా బద్మామ్ హువా' అంటూ సాగే పాటను నిన్న రాత్రి విడుదల చేయగా, ఇప్పటికే దాదాపు కోటి వ్యూస్ సాధించి, టాప్ లోకి వెళ్లిపోయింది. ఈ పాటను మీరూ చూడండి.

More Telugu News