Tirumala: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం... భక్తుల తీవ్ర ఇబ్బందులు!

  • రాత్రి నుంచి వర్షం
  • వర్షపు జల్లుల్లో తడుస్తూనే దర్శనం
  • అనంతపురం జిల్లాలోనూ భారీ వర్షం

గత రాత్రి నుంచి తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరాటంకంగా కురుస్తున్న వానలో తడుస్తూనే భక్తులు స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి. భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా, అద్దె గదులకు కొరత ఏర్పడింది. గదులు దొరకని వారు షెడ్ల కింద విశ్రాంతి తీసుకుంటూ, వర్షపు జల్లులో తడుస్తున్నారు.

కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వానలు కురుస్తున్నాయి.

మరోవైపు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. చాలా ప్రాంతాలు నీట మునగడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని అంచనా వేస్తున్నామని ప్రభుత్వాధికారులు వెల్లడించారు.

More Telugu News