Charlapalli jail: షాద్‌నగర్ హత్యాచారం కేసు.. జనం దాడిచేసినా నిందితులకు ఏం కాకూడదని పోలీసులు ఏం చేశారంటే?

  • వాహనంలో పడుకోబెట్టి నిందితుల తరలింపు
  • ముందు, వెనక పోలీసు వాహనాలు
  • జైలులో హై సెక్యూరిటీ సింగిల్ బ్యారక్‌ల కేటాయింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ వైద్యురాలి హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు నిన్న చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిందితుల తరలింపులో పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులపై జనం దాడిచేయకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఒకవేళ జనం దాడిచేసినా నిందితులకు ఏమీ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

నిందితులను తరలించే వాహనానికి ముందు, వెనక పోలీసు వాహనాలు అనుసరించాయి. జనం రాళ్లతో దాడిచేసినా నిందితులకు ఏమీ కాకుండా ఉండేందుకు వాహనంలో వారిని పడుకోబెట్టారు. శంషాబాద్ నుంచి అత్యంత కట్టదిట్టమైన భద్రత మధ్య వారిని తరలించిన పోలీసులు చర్లపల్లి జైలు అధికారులకు అప్పగించారు. అక్కడ వారికి హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్‌లను కేటాయించారు.

More Telugu News