Rains: నేడు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం పడే అవకాశం
  • రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

భారీ వర్షాలు కురిసే చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి ఒక్కసారిగా నీరు వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం నాడు దక్షిణ కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

More Telugu News