Namitha: బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటి నమిత

  • కొన్నాళ్ల కిందట పెళ్లి చేసుకున్న నమిత
  • తగ్గిన సినిమా అవకాశాలు!
  • జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక

అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కితగ్గని సినీ నటిగా నమితకు ఎంతో పేరుంది. అటు నటన, ఇటు గ్లామర్ తో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బొద్దుగుమ్మ తాజాగా బీజేపీలో చేరింది. కొన్నాళ్ల కిందటే పెళ్లి చేసుకున్న నమితకు ఇటీవల సినిమా అవకాశాలు తగ్గాయి. దాంతో రాజకీయాలపై దృష్టి సారించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నమిత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంది. ఈ సందర్భంగా నమిత వెంట ఆమె భర్త వీరేంద్ర చౌదరి కూడా ఉన్నారు.

More Telugu News