Disha: ప్రియాంక రెడ్డి నిందితుల రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు?

  • మీడియా చానళ్ల వద్ద ప్రియాంక రెడ్డి రిమాండ్ రిపోర్ట్?
  • రిపోర్ట్ లో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు
  • నరకం చవిచూసి కన్నుమూసిన ప్రియాంక

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనలో నిందితుల రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మీడియాలో ప్రసారమవుతున్న రిమాండ్ రిపోర్ట్ ను పరిశీలిస్తే దారుణం అనిపించేలా ఉంది. నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ వెటర్నరీ డాక్టర్ ప్రియాంకకు తన నెంబర్ ఇచ్చి, ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. స్కూటీ బాగు చేయించుకొస్తానని వెళ్లి ఎంతకీ రాకపోవడంతో, ప్రియాంక మహ్మద్ కు ఫోన్ చేసింది. ఆమె మొబైల్ నుంచి వెళ్లిన చివరి కాల్ ఇదే కావడంతో ఈ నెంబర్ కీలకమైంది. దీంతో ఈ నంబర్ ఆధారంగానే పోలీసులు మహ్మద్ ఆచూకీ కనుగొన్నారు.

ఇక, అత్యాచారం సందర్భంగా ప్రియాంక రెడ్డి హెల్ప్ హెల్ప్ అంటున్నా కనికరించకుండా, నోట్లో బలవంతంగా మద్యం పోసిన వైనం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆమెపై నిందితులు వంతుల వారీగా అత్యాచారం జరిపినట్టు తెలుస్తోంది. దాదాపు గంటసేపు ఆమెపై అత్యాచారం జరిపారు. ఆమె అరవకుండా నోరు, ముక్కు గట్టిగా మూయడంతో ఊపిరాడక ఆ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది.

అంతేకాదు, మృగాలు సైతం సిగ్గుపడేలా లారీలోకి ఆమె మృతదేహాన్ని చేర్చిన తర్వాత కూడా తమ పశువాంఛ తీర్చుకున్నారు. షాద్ నగర్ బ్రిడ్జ్ వద్ద ప్రియాంక మృతదేహాన్ని కిందకి దింపి ఆమె బతికుంటుందేమోనన్న అనుమానంతో దహనం చేశారు. కాగా, లారీ క్యాబిన్ లో ప్రియాంక రక్తపు మరకలు, వెంట్రుకలను ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది.

More Telugu News