Bhumi Pednekar: 'భాగమతి' హిందీ రీమేక్ కి సన్నాహాలు

  • తెలుగులో విజయాన్ని సాధించిన 'భాగమతి'
  • హిందీలో టైటిల్ గా 'దుర్గావతి'
  • ప్రధాన పాత్రధారిగా  భూమి పెడ్నేకర్

క్రితం ఏడాది ఆరంభంలో వచ్చిన 'భాగమతి' భారీ విజయాన్ని నమోదు చేసింది. అనుష్క ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమా, ఆమె కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో నిలిచింది. దర్శకుడిగా అశోక్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు ఆయన ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

తెలుగులో అనుష్క చేసిన పాత్రకిగాను ఆయన హిందీలో భూమి పెడ్నేకర్ ను తీసుకున్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి ఈ సినిమాను టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. హిందీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కథలో అశోక్ కొన్ని మార్పులు చేశాడట. ఈ రీమేక్ కి 'దుర్గావతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.

More Telugu News