రాంగోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ!

30-11-2019 Sat 15:23
  • ఈరోజు సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు
  • సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన సభ్యులు
  • రివైజింగ్ కమిటీకి వెళ్లాలని చిత్ర నిర్మాతల నిర్ణయం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఆయన తాజా చిత్రం 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. ఈరోజు ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించారు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉండటంతో... సర్టిఫికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రివైజింగ్ కమిటీకి వెళ్లాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు.